హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(విజయక్రాంతి) : రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు జూబ్లీహిల్స్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి చైర్మన్, ఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల, డైరెక్టర్లు డా.ప్రణతీరెడ్డి, దినేశ్‌కుమార్ చిర్లా, ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ రమేశ్.. 15ఏండ్లుగా తమ సంస్థలో పనిచేస్తున్న 37మంది సిబ్బందిని సన్మానించారు. తమ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం, సహనశీలత, టీమ్‌వర్క్‌తో కోట్ల కుటుంబాలకు సేవలందించినట్లు రమేశ్ తెలిపారు. భవిష్యత్‌లో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్‌ను విడుదల చేశారు.