calender_icon.png 23 January, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరగతి గదుల్లోకి వర్షం నీరు

16-07-2024 01:52:35 AM

  • గోడలను ముట్టుకుంటే విద్యుత్తు షాక్ 
  • హస్నాబాద్ పాఠశాలలో టెంటు వేసి తరగతుల నిర్వహణ 

వికారాబాద్, జూలై 15 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుద్యాల్ మండలంలోని హస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తడిసి ముద్దయింది. సోమవారం ఎప్పటిలాగే విద్యార్థు లు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి తరగతి గదుల్లోకి వెళ్లారు. ఆదివారం రాత్రి కురి సిన వర్షానికి స్లాబుల నుంచి వర్షం నీరు వచ్చి తరగతి గదుల్లోని బెంచీలు మొత్తం తడిసిపోవడంతో పాటు గదుల్లో నీరు నిలిచింది. దీంతో చేసేదేమీ లేక చాలాసేపు విద్యార్థులు బయటే ఉండిపోయారు. గంట ఆలస్యంగా గదుల్లోకి వెళ్లిన విద్యార్థులు గోడలు ముట్టుకుంటే విద్యుత్తు షాక్ వస్తున్నట్లు గమనించి ఆందోళనకు గురయ్యారు. వెం టనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను బయటకు పంపించారు. బయట టెంట్లు వేసి విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. అనంతరం పాఠశాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేసి, గదుల్లో చేరిన నీటిని పంచాయతీ కార్మికులతో తొలగించారు.