లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టీ20 వరల్డ్‌కప్‌ను వరుణుడు వదలడం లేదు. వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దు కాగా.. ఈ జాబితాలో భారత్, కెనడా పోరు కూడా చేరింది. గ్రూప్ భాగంగా శనివారం కెనడాతో రోహిత్‌సేన తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో టాస్ పడకుండానే మ్యాచ్ రద్దుంది. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా.. ఇప్పటికే సూపర్ దశకు చేరిన టీమిండియా 7 పాయింట్లతో గ్రూప్ దశను ముగించింది.
మన గ్రూప్ నుంచి భారత్, అమెరికా సూపర్ దశకు అర్హత సాధించగా.. ఈ నెల 20న అఫ్గానిస్థాన్‌తో రోహిత్ సేన తొలి సూపర్ మ్యాచ్ ఆడనుంది. ఒక్కో జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో రెండు విజయాలు సాధించిన వాళ్లు సెమీఫైనల్‌కు చేరనున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఈ మ్యాచ్‌లోనైనా మన స్టార్లు ఆకట్టుకుంటారేమో అని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. అమెరికాలో టీమిండియా మ్యాచ్‌లు ముగియడంతో సూపర్ కోసం భారత జట్టు వెస్టిండీస్ బయలుదేరనుంది.