హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నగరంలో సోమవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, ప్రగతినగర్, పటాన్‌చెరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్లపోచంపల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది.
గాజుల రామారంలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, పటాన్‌చెరు ఆర్‌సీ పురంలో 2.1 సెం.మీ, కూకట్‌పల్లిలో 1.5 సెం.మీ వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో సెం.మీ కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. కాగా, వాతావరణ శాఖ సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.