హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : నగరంలో పలుచోట్ల ఆదివారం ఓ మోస్త్తరు వర్షం కురిసింది. మల్కాజిగిరి, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, దోమగూడ, బాగ్‌లింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బం జారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. అడ్డగుట్టలో 44.5 మి.మీ మెట్టుగూడలో 28.5 మి.మీ, సీతాఫల్‌మండిలో 24.3 మి.మీ, కూకట్‌పల్లిలో 16.0 మి.మీ, లాలాపేట్‌లో 7.3 మి.మీ, షాపూర్‌లో 7.0 మి.మీల వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.