calender_icon.png 19 April, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

10-04-2025 03:53:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుసింది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్ పల్లి, గగిల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి,  భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.