calender_icon.png 4 October, 2024 | 9:00 PM

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

04-10-2024 06:19:46 PM

హైదరాబాద్,(విజయక్రాంత్రి): హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న నగర వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. బంజారాహిల్స్, అమీర్ పేట్, సనత్ నగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బోరబండ, మధురానగర్, పంజాగట్ట, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్ పూరా, యాకుత్ పురా, ఉప్పుగుడా, బార్కాస్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చాదర్ ఘట్, సైదాబాద్, చంపాపేట్, కర్మాన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లో వర్షం పడ్డింది.