20-03-2025 10:46:13 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన కొద్దిపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి పగలంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా రాత్రి మాత్రం చల్లటి గాలులు విచాయి. అనంతరం ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. వర్షపు జల్లులు కురువగానే గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం నుంచి వేడెక్కిన వాతావరణం రాత్రి కురిసిన చిరు జల్లులకు వాతావరణం చల్లబడింది.