18-04-2025 02:31:08 PM
కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం(Kangti Mandal) పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం(Rain) కురిసింది. ఈరోజు ఉదయం నుండి ఎండ తీవ్రతతో వాతావరణం పొడిగా ఉంది. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో మండలంలోని చాప్టా కే గ్రామంలో ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. బలమైన గాలి వీయడంతో కొందరి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరాయి. వేడిమి ఉక్క పోతతో ఉన్న ప్రజలకు వర్షం కారణంగా వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.