15-04-2025 02:26:08 PM
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాతావారణం ఉన్నట్లుండి మారింది. పలు ప్రాంతాల్లో మంగళవారం జోరుగా వర్షం(Hyderabad Rain) పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలీచౌకి, గోల్కొండ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. దీంతో నగర ప్రియులు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని వివిధ
జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి, జనగాం, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం, రాత్రి తీవ్రమైన తుఫానులు వస్తాయని అంచనా వేశారు. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం, ఏప్రిల్ 17 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ అంచనా దృష్ట్యా, వాతావరణ శాఖ గురువారం వరకు పసుపు హెచ్చరిక జారీ చేసింది.