calender_icon.png 4 April, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ లో భారీ వర్షం

03-04-2025 03:18:57 PM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం మధ్యాహ్నం నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది(Hyderabad rainfall). సాయంత్రం 5 గంటలలోపు భారీ వర్షం కురిసే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సచివాలయం, అబిడ్స్, నాంపల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, పంజాగుట్ట, టోలిచౌకి, మెహిదిపట్నం, మణికొండ, గచ్చిబౌలి, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, కోఠి, సికింద్రాబాద్‌లో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఒక్క సారిగా వర్షం పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఉన్నట్టు ఉండి వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వరదనీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. 

ముందుగా, భారత వాతావరణ శాఖ (India Meteorological Department) గురువారం, శుక్రవారం హైదరాబాద్‌లో మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. సూచన ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షపాతం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వాతావరణ శాఖ రాబోయే రెండు రోజులు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మండలాలు ఈ హెచ్చరిక పరిధిలోకి వస్తాయి.