calender_icon.png 22 March, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం పడితే బురదమయం

21-03-2025 09:03:59 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలోని గల్లీలో శుక్రవారం నాడు పడ్డ వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ బురదతో నిండిపోయినది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరము ఎప్పుడు వర్షం పడ్డ ఇదే పరిస్థితి, రోడ్డుపైకి మోరిలోని బురద మొత్తము వచ్చి వాకిట్లో నిలబడి ఉంటది దానిని దాటుకుంటూ, అంటించుకుంటూ, ఇంటిలోనికి పోవడము జరుగుచున్నది. దీనివలన కాలనీ వాసులకు చాలా దుర్గంధం వేదజల్లుతున్నది అని కాలనీ వాసులు వాపోతున్నారు. కాలనీలో అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. వర్షం పడ్డప్పుడు, ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న కాలనీ వాసులు, దీనివలన కాలనీలో క్రిములు, కీటకాలు, దోమలు, ఈగలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ విషయాన్ని కాలనీవాసులు అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న  ఏ ఒక్కరూ దీనిని పట్టించుకోలేదు.  కాలనీవాసులకు వాపోయారు, ఇప్పటికైనా  ఏ ఒక్క అధికారైనా సరే, రాజకీయ నాయకులైనా సరే పట్టించుకోని మా కాలానికి సిసి రోడ్డు,  మోరి వసతులు కల్పించగలరని కోరుతున్నారు.