calender_icon.png 22 March, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోల్‌లో వర్షం

21-03-2025 10:37:45 PM

అందోల్: గత కొన్ని రోజులుగా భానుడి భగభగతో నిప్పుల కొలిమిగా మారిన ఆందోలు నియోజకవర్గంలో పలు మండలాలలో శుక్రవారం సాయంత్రం ఉరుములతో కూడిన మోస్తారు వర్షం  కురిసింది. వట్టిపల్లి, రేగోడు, రాయికోడ్, అల్లాదుర్గం మండలంలోని పలుచోట్ల వడగళ్ల వాన పడింది. ఎండ ప్రభావంతో ఒక్క పొతతో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ వర్షం ఊరట నిచ్చింది. నీళ్లు లేక పంటలు ఎండిపోతు బిటలు వారుతున్న  నేపథ్యంలో ఈ అకాల వర్షం పంట నేలను  తడిచేసింది.