కులు, జూలై 30: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలకు కొండలపై నుంచి వరద పోటెత్తటంతో ఓ పాదచారుల వంతెనతోపాటు అనేక భవనాలు కొట్టుకుపోయాయి. కొండలపై నుంచి పెద్దపెద్ద బండరాళ్లు దొర్లిపడ్డాయి. కులూ జిల్లాలోని తోష్ నల్లాహ్ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని అధికారులు తెలిపారు.