calender_icon.png 3 October, 2024 | 6:58 PM

తెలంగాణకు వర్ష సూచన

03-10-2024 03:31:29 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఈసీఐఎల్, నాచారం, ఉప్పల్, తార్నాక, బోడుప్పల్, రామాంతపూర్, ఎల్బీనగర్, కొత్తపేట, నాగోల్, మెట్టుగూడ వాన పడింది. ఉదయం నుంచి ఎండ కొట్టినప్పటికీ మధ్యాహ్నం ఒక్క సారి వర్షం రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో జీహెచ్ఎంసీ వెంటనే అప్రమత్తం అయింది. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాలకు వర్షాలు కుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. రానున్న 3 గంటలలో నాగర్‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.