calender_icon.png 17 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్‌లో మళ్లీ వర్షం

24-09-2024 12:00:00 AM

రహదారులపై నిలిచిన వరద

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో మూ డు రోజులుగా ఉదయం మమూలుగా ఉండి, సాయంత్రం వేళ్లలో వాన దంచి కొడుతోంది. దీని లో భాగంగా సోమవారం సాయంత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అల్వాల్, హబ్సీగూడ, తార్నాక, లాలపేట్, ఎల్బీనగర్, నాచారం, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్ , నాం పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రమదారులపై వరద చేరింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. అల్కాపురి కాలనీలో అత్యధికంగా 3.6 సెంమీ, అత్యల్పంగా కాప్రాలో 1.2 సెంమీ వర్షపాతం నమోదైంది.