calender_icon.png 12 February, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి

12-02-2025 12:05:11 AM

మేడ్చల్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి కాంట్రాక్టర్ కు సూచించారు. మంగళవారం రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు.

శివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, పనులు పూర్తి చేస్తే ఇబ్బంది కలగదని అన్నారు. ఇటీవల పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారని అన్నారు.

విక్రమ్ రెడ్డి వెంట మున్సిపాలిటీ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, సీనియర్ నాయకులు కిషన్ రావు, పాతూరి సుధాకర్ రెడ్డి, ఎల్లంపేట జగన్ గౌడ్, జాకాట ప్రేమ్ దాస్, లవంగ శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, మైసరి రాజు, దాత్రిక లక్ష్మణ్, అర్జున్ రాగం, ఈశ్వర్, సాయికుమార్, వంశీధర్ రెడ్డి, కంచు కంట్ల మహేష్, కానుగంటి వంశీ, నరేందర్ ఉన్నారు.