calender_icon.png 4 February, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుత ఫీచర్లతో రైల్వే సూపర్ యాప్

04-02-2025 01:52:46 AM

న్యూఢిల్లీ: రైళ్లకు సంబంధించిన అన్ని సేవలూ ఒకేచోట అందించే ఓ సూపర్ యాప్‌ను భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. స్వరైల్ పేరిట దీన్ని లాంచ్ చేసింది. అయితే, దీన్ని అందరూ వాడలేరు. ఎందుకంటే ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. పరి మిత సంఖ్యలో యూజర్లు మాత్రమే వాడేందుకు వీలుంటుంది.

కాబట్టి అందరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై వెయ్యి మంది చొప్పున తొలుత రైల్వేశాఖ ఈ అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటికే బీటా టెస్టింగ్ ఎంచుకున్న వారి సంఖ్య పూర్తయ్యిందని ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిపింది. బీటా టెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు, చేర్పులతో పౌరులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు.