calender_icon.png 26 December, 2024 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేస్టేషన్ ఆధునీకరణపనులను పూర్తిచేయాలి

15-07-2024 01:40:33 AM

ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘరామిరెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం, జులై 14(విజయక్రాంతి): భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ ఆధు నీకరణ పనులు వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ రామసహాయం రాఘరామిరెడ్డి ఆదేశించారు. ఎంపీ హోదా లో తొలిసారి ఆయన ఆదివారం కొత్తగూడెంలో పర్యటించారు. రైల్వే స్టేషన్‌లో చేప డతున్న ఆధునీకరణ పనులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టాలన్నారు. అనంత రం కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ వచ్చేలా చేసిన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పర్యటనలో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మాస్టర్ విశ్వనాథ్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, రైల్వే అధికారులు రామ్ జన్ వీణా, పాషా, రాజీరెడ్డి ఉన్నారు.