రైల్వేలో మహిళలు పనిచేయడం సాధారణ విషయం కాదు.. ఒకవైపు ప్రయాణికుల భద్రత, మరోవైపు రైల్వే ఆస్తుల పరిరక్షణ ఒత్తిడితో కూడుకున్న టాస్క్. ఇలాంటి కష్టసాధ్యమైన రంగంలోనూ విజయవంతంగా రాణిస్తున్నారు మహిళలు. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేలో నాలుగు కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు ఓ ముగ్గురు. ‘ఇది మహిళ శక్తికే నిదర్శనం, రైల్వే చరిత్రలో ఇదే తొలిసారి’ అన్న జీఎం అరుణ్ కుమార్ మాటలను నిజం చేస్తూ రైల్వేపై తమదైన ముద్ర వేస్తున్నారు వనితలు.
రమేష్ మోతె, విజయక్రాంతి
దక్షిణ మధ్య రైల్వేలోని కీలక విభాగాల్లో మహిళా అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మొట్టమొదటిసారిగా మహి ళా అధికారులు సెక్యూరిటీ, కమర్షియల్, ఆపరేటింగ్ అండ్ మెడికల్ మొదలైన నాలు గు కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే భద్రతా విభా గానికి అరోమా సింగ్ ఠాకూర్ (ఐఆర్‌పీఎఫ్‌ఎస్) ఇన్‌స్పెక్టర్ జనరల్ -కమ్ -ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ (ఐజీ-కమ్‌పీసీఎస్‌సీ)గా, దక్షిణ మధ్య రైల్వే ఆపరేటింగ్, కమర్షియల్ రెండు విభాగాలకు కె. పద్మజ (ఐఆర్‌టీఎస్) ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా బాధ్యతలు వహిస్తున్నారు.
అలాగే దక్షిణ మధ్య రైల్వే వైద్య విభాగానికి డాక్టర్ నిర్మల నరసింహన్ (ఐఆర్‌ఏఎస్) నూతన ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నాయకత్వం వహిస్తున్నారు. రైళ్ల కార్యకలాపాలను మెరుగుపర్చడం, జోన్ మొత్తం పనితీరుకు కీలకమైన సూచలను ఇవ్వడం, భద్రతా, పనితీరు లాంటి సమీక్ష సమావేశాల్లో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
మహిళ శక్తికి నిదర్శనం
తొలిసారిగా నాలుగు విభాగాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. వివిధ రంగాల్లో మహిళల శక్తికి ఇదే నిదర్శనం. మహిళల భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టి మహిళా సాధికారతను పెంపొందించడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది. వివిధ విభాగాలకు ప్రిన్సిపల్ హెడ్‌లుగా ఈ మహిళా అధికారుల పాత్ర మరింత మంది కొత్త శిఖరాలను చేరుకోవడానికి స్ఫూర్తినిస్తుంది.
రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
నిర్మల నరసింహన్
డాక్టర్ నిర్మల నరసింహన్ (ఐఆర్‌ఎస్ బ్యాచ్) డిసెంబర్ 2024లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మెడికల్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె ఉద్యో గులు, వారి కుటుంబాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్ నిర్మల ఉద్యోగులు, వారి కుటుంబాలు, ప్రయాణుకుల సంక్షేమానికి భరో సా ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. తద్వారా జోన్ సమర్థవంతమైన, సురక్షితమైన పనితీరుకు గణనీయంగా తోడ్పడుతున్నారు.
కే పద్మజ
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఏం)గా కె. పద్మజ (ఐఆర్‌టీఎస్1991 బ్యాచ్) జూలై, 2024లో బాధ్యతలు స్వీకరించారు. కమర్షియల్ డిపార్ట్‌మెంట్ అధిపతిగా ప్రయాణికుల, సరుకు రవాణా సేవల సమర్థవంతమైన నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. అలాగే టికెటింగ్, రిజర్వేషన్లు, కస్టమర్ సహాయం, సరుకు రవాణా కార్యకలాపాలు, స్టేషన్ నిర్వహణ, ప్రకటనలు, నాన్-ఫేర్ రాబడి, మార్కెటింగ్ వ్యాపార అభివృద్ధి, ఆదాయ ఉత్పత్తి సేవలను నిర్వర్తిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 నవంబర్, 2024 చివరినాటికి 175 మిలియన్ల మంది ప్రయాణాలు సాగించారు. తద్వారా రైల్వేకు రూ. 3,817 కోట్లు ఆదాయం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా (నవంబర్) స్థూల మూలాధార ఆదాయం రూ. 13,231 కోట్లు సాధించడంలో ఆమె సేవలు కీలకం. ఈమె దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
అరోమా సింగ్ ఠాకూర్
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్- కమ్- ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ (ఐజీ-కమ్ పీసీఎస్‌సీ)-గా అరోమా సింగ్ ఠాకూర్ (ఐఆర్‌పీఎఫ్‌ఎస్ 1993 బ్యాచ్) జూలై, 2023లో బాధ్యతలు స్వీకరించారు. ఈమె రైల్వే లో రైలు ప్రయాణికులకు, రైల్వే ఆస్తు ల భద్రతకు ప్రాముఖ్యతనిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆర్‌పీఎఫ్ నేరం, నేరాల దర్యాప్తు, విపత్తు ప్రతిస్పందన, క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా పర్యవేక్షణ, ప్రయాణుకులకు సహాయం వంటి ప్రధాన బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం- వేడుకల్లో భాగంగా ఆమె నాయకత్వంలోని ఆర్‌పీఎఫ్ శకి’ టీమ్‌కు ‘మహి ళల రక్షణ కేటగిరీ’ కింద అవార్డు ప్రదానం చేసింది. జోన్‌వ్యాప్తంగా ప్రయాణికుల ప్రాణాలను, రైల్వే ఆస్తులను కాపాడేందుకు ‘ఆపరేషన్ యాత్రి సురక్ష, ఆపరేషన్ అమానత్, ఆపరేషన్ నాన్‌హే ఫరిస్తే, ఆపరేషన్ సతార్క్’ లాంటి పలు కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు.