calender_icon.png 15 November, 2024 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు రైల్వే మజ్దూర్ యూనియన్ కృషి..

15-11-2024 03:04:13 PM

రైల్వే కార్మికుల సమస్యలను దశలవారీగా  పరిష్కరించేందుకు రైల్వే మజ్దూర్ యూనియన్  కృషి చేస్తుంది : సికింద్రాబాద్ బ్రాంచ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవీందర్

కాప్రా (విజయక్రాంతి): రైల్వే కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు రైల్వే మజ్దూర్ యూనియన్ కృషి చేస్తుందని సికింద్రాబాద్ బ్రాంచ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఎన్నికలలో భాగంగా ఘట్కేసర్ బ్రాంచ్ పరిధిలోని చర్లపల్లి, మౌలాలి రైల్వే స్టేషన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రైల్వే కార్మికులకు పెన్షన్ సౌకర్యము కల్పించేందుకు యూనియన్ కృషి చేస్తుందని, కార్మికులకు ఎనిమిది గంటల పని విధానము అమలు చేయడంతో పాటు రైల్వేలో ఖాళీగా ఉన్న భర్తీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల డిసెంబర్ 4, 5, 6వ తేదీలలో నిర్వహించే ఎన్నికలలో కార్మికుల విధిగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏడిఎస్ చిలుక స్వామి, ఘట్కేసర్ బ్రాంచ్ కార్యదర్శి బొల్లాపల్లి శ్రీనివాస్, బ్రాంచ్ చైర్మన్ విజయ్ కుమార్, కోశాధికారి ఆకుల ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి దిలీప్ కుమార్, ప్రతినిధులు భూషపాక హరికృష్ణ, ఎర్రవల్లి వెంకటేశ్వర్లు, ప్రభాకర్ కుమార్, స్వామి,బెల్లి కుమార్, చర్లపల్లి స్టేషన్ మాస్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.