01-03-2025 08:26:50 PM
భద్రాచలం,(విజయక్రాంతి): మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఏఎంసీ కాలనీలో పట్టణ అధ్యక్షుడు డేగల శివ అధ్యక్షణ శనివారం జరిగింది. ఈ సమావేశానికి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాలరాజ్ హాజరై మాట్లాడుతూ.. భద్రాచలానికి రైల్వే లైన్ పొడిగించాలని కోరారు. రైల్వే నిర్మాణం పూర్తి అయితే సూదురా ప్రాంతాలనుండి వచ్చే భక్తులకు ప్రయాణం సౌకర్య వంతం గా ఉంటుంది అన్నారు. ఈ రైల్వే పొడగింపుకు స్థానిక ఎంపీ పోరిక బాలరాం నాయక్ భద్రాచలం అభివృద్ధి కోసం కృషి చేయాలని, కోరారు. ఈ కార్యక్రమంలో బర్ల రామ కృష్ణ, దాసరి శ్యాంతయా, యేసు, గుండె శీను, మురికి శీను, ఖుషిన శ్యామ్, ఉదయ్ కాంత్, వంశీ, చీకటి దాసిం బాబు, శ్యాంయేలు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.