calender_icon.png 13 January, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్‌లో ‘రైల్ రోకో’

19-12-2024 01:56:12 AM

* మూడుగంటల పాటు రైలు పట్టాలపై నిరసన

* నిలిచిన రైళ్ల రాకపోకలు

చండీగఢ్, డిసెంబర్ 18: ఆరుగాలం శ్రమించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ బుధవారం పంజాబ్ రైతాంగం పెద్దఎత్తున నిరసన తెలిపింది. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపు మేరకు మోగా, ఫరీద్‌కోట్, కడియన్, బటాలా, ఫిలింనగర్, తాండా, దుసుయా, మఖూ, తల్వాండీ భాయ్, పాటియాలా, సాహ్నేవాల్, మొహాలీ, సంగ్రూర్ తదితర రైలు మార్గాల్లో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ‘రైల్ రోకో’ నిర్వహించారు. రైలు పట్టాలపై అడ్డంగా పడుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయా మార్గాల్లో నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆలస్యంగా రైళ్లు నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘రైల్ రోకో’పై కిషాన్ మజ్దూర్ మోర్చా నేత సర్వన్‌సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతాంగం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మున్ముందు మరింత ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.