calender_icon.png 24 October, 2024 | 2:02 AM

చరిత్రకు సాక్ష్యం రాయికోడ్

17-09-2024 04:50:00 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజాం రాజు బీదర్ కోట నుంచి పాలించే రోజుల్లో రాయికోడ్‌ను ప్రధాన స్థావరంగా ఉండేది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రాంతం నైజాం పాలనలోనే ఉండేది. దీంతో సంగారెడ్డి ప్రాంతంలోని రాయికోడ్ కూడా నైజాం పరిపాలన కిందే ఉండేది. నైజాం ప్రభువు నియమించిన జాగీర్దార్ బీదర్ నుంచి పరిపాలన సాగించేవారు. దీనిలో భాగంగా రాయికోడ్‌కు నియమితులైన రజాకార్లు ప్రజాకంటకులుగా వ్యవహరించే వారని ఇప్పటికీ పెద్దలు చెప్తారు.

దీంతో నిజాం పాలన నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ రాయికోడ్ ప్రజలు తిరగబడే ప్రయత్నం కూడా చేశారు. కొందరు ఆర్యసమాజ్ సభ్యులు సైతం ఉద్యమించారు. దీంతో రజాకార్లు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో 15 మంది ఆర్యసమాజ్ నాయకులు, ప్రజలు చనిపోయారు. రజాకార్ల కాల్పుల్లో చనిపోయిన వారు కాక, కొందరు దివ్యాంగులుగా మిగిలారు.