నిజామాబాద్‌లో పలువురిపై కేసులు
కామారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): నిజామాబాద్‌లో నకిలీ వైద్యుల ఆగడాలపై ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేశ్‌కుమార్ నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బృంద సభ్యులు సన్ని డేవిస్, డాక్టర్ శిరీశ్‌తో కలిసి నిర్వహించిన దాడుల్లో నకిలీ వైద్యుల లీలలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లా వైద్యాధికారి అనుమతి లేకుండా మంచిప్ప గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న విట్టల్ సింగ్, మహేశ్, ఇందల్వాయిలో గంగాధర్, డిచ్‌పల్లిలో నరసింహులు, గోలి సందీప్, శ్రీరామ్, దత్త్రాద్రిని అదుపులోకి తీసు కున్నారు. వీరం తా కిన్లిక్‌లు ఏర్పా టు చేసి ఇష్టానుసారం హైడోస్ యాంటిబయోటిక్, స్టేరాయిడ్స్, నొప్పి నివారణ ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. వీరిపై ఎన్‌ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు మహేశ్‌కుమార్ తెలిపారు.