- డ్రగ్స్ నిర్ధారణ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్
- నిర్వాహకులను విచారించిన ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పరిధిలోని పలు పబ్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు, సిబ్బంది ఏకకాలంలో ఆకస్మిక దాడులు చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. జూబ్లీహిల్స్‌లోని నికోస్, బేబీలోన్, ఇల్లుజైయిన్, మాదాపూర్‌లోని విస్కీ, నాలెడ్జ్ సెంటర్‌లోని కోరం పబ్స్‌లో ఎక్సైజ్, టీజీ న్యాబ్ దాడులు నిర్వహించారు. 33 మంది అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించారు.
బాబీలోన్ పబ్సులో ఇద్దరికి, కోరం పబ్సులో మరో ఇద్దరికి పాజిటివ్ తేలింది. కోరం పబ్‌లో లిక్కర్ సరఫరా చేసే ఓ వ్యక్తికి నిబంధనల ప్రకారం 21 ఏళ్లు ఉండాల్సి ఉండగా, 20 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ డీజేకి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. డ్రగ్స్ పాజిటివ్ తేలిన వారిని వరంగల్‌కు చెందిన చిన్న నగేష్, ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన నార్త్ రవికుమార్, హైదరాబాద్‌కు చెందిన టీవీఎస్ కేశవరావు, అబ్దుల్ రహీంగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.