calender_icon.png 13 November, 2024 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

09-11-2024 01:38:21 AM

ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, మటన్ గుర్తింపు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి):  నగరంలోని పలు హోట ళ్లు, రెస్టారెంట్లలో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఉప్పల్‌లోని లక్కీ, సురభి రెస్టారెంట్, అల్వాల్‌లోని రిలయన్స్ స్మార్ట్ మాల్, యతి హోటల్, దోమలగూడలోని ఆమంత్రన్ బెంగాలీ రెస్టారెంట్, అశోక్‌నగర్‌లోని వర్కింగ్ హాస్టల్‌లో దాడులు నిర్వహించి..

ఫ్రిజ్‌లో చికెన్, మటన్ పదార్థాలను నిల్వ ఉంచడం, కిచెన్‌లో బొద్దింకలు ప్రత్యక్షం కావడం, కాలం చెల్లిన పదార్థాలతో పాటు అపరిశ్రభమైన వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. నాణ్యత లేని పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వచ్చే ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అల్వాల్ యతి మిలటరీ హోటల్‌లో పరిశుభ్రతకు సంబంధించిన లోపాలను గమనించి నోటీసులు జారీ అందజేశారు. 

గడువు తీరిన కూల్‌డ్రింక్స్ విక్రయాలు 

రాజేంద్రనగర్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ వార్డు పరిధిలో ఉన్న వెంకటేశ్వర కిరాణా జనరల్ స్టోర్‌లో మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. గడువు తీరిన కూల్‌డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి దుకాణాదారుడికి రూ.1000 జరిమానా విధించారు. ఆర్‌ఐ శివకుమార్, బిల్ కలెక్టర్ సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.