ఖమ్మం, నవంబర్ 18 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో సోమవారం ఫుడ్ సేప్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆహార తయారీ కేంద్రాలు, అల్లం వెల్లుల్లి స్టోరేజ్, విక్రయ కేంద్రాలు, స్వీట్ తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని రిక్కా బజార్‌లోని మ్యాజిక్ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా తయారీ, స్టోరేజీ, విక్రయ యూనిట్‌తో పాటు వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.
అల్లం, వెల్లుల్లి మిశ్రమాల బాటిల్స్‌పై సరైన వివరాలు లేనట్టు గుర్తించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను డిటర్జెంట్లు, ఫినాయిల్ వంటి రసాయనాల పక్కనే నిల్వ చేయడంతో అల్లం వెల్లుల్లి నకిలీ పేస్ట్ అని అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో రూ.లక్షా 32వేల విలువైన 960 కిలోల అల్లం, వెల్లుల్లి విశ్రమాన్ని సేజ్ చేశారు. సేకరించిన నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపించారు. చర్చ్‌కాంపౌండ్‌లోని విజయలక్ష్మీ పిండి వంటల్లో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు.