calender_icon.png 20 January, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు

11-09-2024 02:47:04 AM

అనుమతి లేకుండా తయారు చేస్తున్న దగ్గు మందుల స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కూకట్‌పల్లి లోని ప్రశాంత్ నగర్‌లో ఉన్న అఖిల్ లైఫ్ సైన్సెస్‌లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం దాడులు నిర్వ హించారు. లైసెన్స్ లేకుండా ‘గ్లుకోరిల్’ అనే దగ్గు సిరప్ తయారు చేస్తు న్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.65 వేల విలువైన 100 మిల్లీలీటర్ల సామర్థ్యం గల 635 బాటిళ్ల దగ్గు మందులను, సంస్థ  యజమాని సీ భాస్కర్‌రెడ్డి నుంచి ప్రింటెడ్ లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను సేకరించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుం టామని కూకట్‌పల్లి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సహజ, ప్రశాంత్‌నగర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎం శ్రీబిందు తెలిపారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.