calender_icon.png 26 November, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ సమావేశం సక్సెస్

06-11-2024 01:13:41 AM

  1. కుల గణనకు మేధావులు, ప్రొఫెసర్లు, పలు కుల సంఘాల సంపూర్ణ మద్దతు 
  2. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీసీ నేతల ఆశాభావం
  3. అగ్రనేత రాకతో కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): కులగణనపై బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం గ్రాండ్ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ‘సంప్రదింపు లు’ పేరిట చేపట్టిన సమావేశంలో ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులు, వివిధ కుల సంఘాల నేతలు 400 మంది వరకు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు వీరంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాసు మున్షి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావుతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ మాడల్‌గా దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కులగణన ఒక లోతైన అంశమని, దేశంలో కుల వివక్షత ఎంత తీవ్రమైన సమస్యనో అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి వివరించారు. పార్టీ శ్రేణుల్లో, ప్రధానంగా దళిత, గిరిజన, ఓబీసీ వర్గాలను ఆకర్శించే విధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వివక్ష రుగ్మతలను రూపు మాపేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పడం పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదటిసారి రాష్ట్రానికి రావ డం, సమావేశం విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, సూరేపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది: మంత్రి ఉత్తమ్ 

రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. తెలంగాణలో ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ పర్యటించి కులగణన చేపడుతామని హామీ ఇచ్చారు. దానిని నేరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. కుల గణన చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం. ఇచ్చిన మాట కట్టుబడి కుల గణన చేస్తున్నాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే అధ్యయనం చేశాం. స్థాని క సంస్థల ఎన్నికల్లో జనాభా లెక్కల మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. 

రాహుల్ ప్రధాని కావడం ఖాయం : వీ హనుమంతరావు

రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖా యం. కులగణన చేయాలని రాహుల్‌గాంధీ పట్టుదలతో ఉన్నారు. బీజేపీ నాయకులకు ఏమిచేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు.

మాట ఇస్తే కాంగ్రెస్ అమలు చేస్తుంది : మహేశ్‌కుమార్‌గౌడ్ 

తెలంగాణలో కులగణన చేపడుతు న్న తరుణంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నా. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిం దంటే అమలు చేసి తీరుతారు. ఎన్నికల ముందు కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భారత్ జోడోయాత్ర సం దర్భంగా అనేక మంది మేధావులను, కుల సంఘాలను, సామాజిక కార్యకర్తల ను కలిశారు. వారి నుంచి అభిప్రాయాల ను తీసుకుని కులగణనకు హామీ ఇచ్చారు.