calender_icon.png 30 November, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా ఆలోచనలు రాహుల్ అమలు

13-08-2024 03:47:11 AM

  1. అందుకే బంగ్లాదేశ్ ఘటనపై మాట్లాడట్లేదు 
  2. మువ్వెన్నెల జెండా అందరి ఆత్మగౌరవ ప్రతీక
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, ఆగస్టు 12(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. చైనా ఆలోచనలను అమలు చేసే వ్యక్తి అని, చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై ఆయన నోరు విప్పడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌లో హర్‌ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్దను యాత్రను బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. టవర్‌సర్కిల్ వరకూ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ధి కోసం దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలో చనను తెరమరుగు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతోపాటు మహనీయులను త్యాగాలను స్మరించుకునేందుకు ప్రధా ని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్‌ఘర్‌తిరంగా నిర్వహిస్తున్నట్టు స్పష్టంచేశారు.  మూడు రంగుల జాతీయ జెండా మనందరం ఆత్మగౌరవ పతాకమని, జెండా, ఏజెం డాలు పక్కనపెట్టి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమతమ ఇండ్లపై మువ్వెన్నెల ఎండాను ఎగురవేయాలని, దేశభక్తుల ఫోటోలను పంద్రాగస్టు వరకు వా ట్సాప్ డీపీలుగా పెట్టుకోవాలని కోరారు.