ముంబై, నవంబర్ 17: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని, ఆయన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అబద్ధాలు చెబుతూ రాహుల్ బాధ్యతారాహిత్యంగా మా ట్లాడుతున్నారని, రాజ్యాంగం రద్దు చేస్తామని ప్రచారంలో చెబుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని, బీజేపీ అలా ఎప్పటికీ చేయదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.