03-05-2024 12:32:43 AM
బీజేపీ సభలో పార్టీ కార్యకర్తల సమాధానం
కొల్హాపూర్, మే 2: సాధారణంగా ఎన్నికల ప్రచార సభల్లో ఎవరికి ఓటేస్తారంటూ నేతలు అడుగుతుంటారు. అయితే పదేపదే అదే ప్రశ్నను అడిగితే ఎవరికైనా తిక్కరేగుతుంది. అలాగే జరిగింది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో. ఇక్కడ జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ నేతలకు సొంత కార్యకర్తలే షాక్ ఇచ్చారు. దీంతో అక్కడి నేతలు కాసేపు నిర్ఘాంతపోయారు. బీజేపీ అభ్యర్థి ధనంజయ్ మహాదిక్ తరఫున బీజేపీ మహి ళా నేత సౌమిక మహాదిక్ ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారత్ పగ్గాలు ఎవరికి అప్ప గించాలి..? రాహుల్‌కా.. నరేంద్ర మోదీ కా అని ప్రశ్నించారు. అయితే పదే పదే అదే ప్రశ్న అడుగుతుండటంతో అక్కడున్న కార్యకర్తలు అసహనంతో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ ఆమెకు షాక్ ఇచ్చారు.