హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ కు రానున్నారు. దీంతో రాహుల్ ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి భారీ జన సమీకరణను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బోయిన్ పల్లి వరకు 8 కి.మీ. మేర భారీ కటౌట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కుల గణనపై సాయంత్రం సంప్రదింపుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు.
ఈ కార్యక్రమం సికింద్రాబాద్ బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కులసంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు సహ 400 మంది హజరుకానున్నారు. రాహుల్ గాంధీ సాయంత్రం రాయ్ బరేలి నుంచి బేగంపేట చేరుకోని 5.30 నుంచి 6.30 వరకు ఐడియాలజి సెంటర్ లో మేధావులు, బీసీ సంఘాల ప్రతునిధులు, కులగణనపై అభిప్రాయలు అడిగి తెలుసుకోనున్నారు. అదే విధంగా కుల గణన ద్వారా జరిగే లాభాలను ఆయన వివరించనున్నారు.