ఫైర్ అయిన అమిత్ షా
ముంబై, నవంబర్ 12: రాహుల్ గాంధీ యే కాదు.. వారి తాతలు, తండ్రులు, ముత్తాతలు ఇలా నాలుగు తరాల వారు దిగొచ్చినా జమ్మూలో ఆర్టికల్ 370ని మరలా తీసుకురాలేరని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో ఓ సభలో మాట్లాడు తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ హయాం లో నక్సలిజం నిర్మూలించామని, మీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. మహా ఎన్నికల కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహాయుతి అధికారంలో ఉంది.