calender_icon.png 2 January, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ జీ.. మాట నిలబెట్టుకోండి

04-08-2024 03:38:29 AM

మిమ్మల్ని నమ్మి తెలంగాణ యువత ఓటేశారు

‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్‌వేదికగా శనివారం మరోసారి విమర్శలు కురిపించారు. రాహుల్ జీ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగులు ఇస్తామన్న మీ మాటలు నమ్మి తెలంగాణ యువత కాంగ్రెస్‌కు ఓటేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా, ఎన్ని ఉద్యోగాలో చెప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. మరోసారి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి యువతను కలిసి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

పోరాటాలు మాకు కొత్త కాదు 

బీఆర్‌ఎస్‌కు పోరాటాలు కొత్తకాదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటామని, బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూ ఉంటామని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్‌గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి ఎండగడుతామని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తిలేదని స్పష్టంచేశారు.