కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆరెస్సెస్, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికాలో మూడు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన రాహుల్ టెక్సాస్‌లో ప్రవాస భారతీయుల కా ర్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ఆరెస్సెల్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలకు మోదీ అంటే భయం పోయిందన్నారు. ‘భారత దేశం అంటే ఒకే సిద్ధాంతం అనే ఆలోచనతో ఆరెస్సెస్ ఉంది. కానీ భారత్‌ను సిద్ధాంత బహుళత్వంగా కాంగ్రెస్ భావిస్తోందన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో లాగానే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని మేము కోరుకుంటున్నా’ మన్నారు.
దానిపైనే తా ము పోరాటం చేస్తున్నామని చెప్పారు. భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రేమ, గౌరవం వంటివి తగ్గిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోలేదు. దీంతో అప్ప టివరకు బీజేపీ, మోదీపై ప్రజల్లో ఉన్న భయం పోయింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాధించిన విజయం కాదు. రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమని గ్రహించిన ప్రజల విజయమన్నారు.అదే విధంగా మహిళ ల పట్ల కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక తేడాలున్నాయని, వా టిపై కూడా తాము పోరాటం చేస్తున్నామన్నారు. ‘బీజేపీ, ఆరెస్సెస్‌లు మ హిళలు కొన్ని పనులకు మాత్రమే పరిమితం కావాలని నమ్ముతారు.
కానీ మేము అలా కాదు. మహిళలు ఏంచేయాలని కోరుకున్నా అనుమతించాలని నమ్ముతున్నాం’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఆధునిక భారత దేశ పు పునాది రాజ్యాంగం. ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని భారత్ జోడో యాత్రలోను, ఆ తర్వాత తాను చెప్పినప్పుడు దేశ ప్రజలు నమ్మారని అన్నారు. మన జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను సమానంగా ప్రతిబింబిస్తుంది. ఒక రాష్ట్రం గొప్ప అని మరో రాష్ట్రం తక్కువని ఎక్కడా ఉండదు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుందని ఈ గీతం స్పష్టం గా చెబుతుంది. భాషలు, సంప్రదాయాలు కూడా అంతే. తమిళం మాట్లాడేవారు తమకు నచ్చరని, హిందీ మాట్లాడే వారే తమకు ఇష్టమని చెప్పడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష గురించి ప్ర ధానంగా ప్రస్తావించడం గమనార్హం. తెలుగు భాష అంత ముఖ్యం కాదని చెబితే అది ఆ రాష్ట్రాల ప్రజలను అవమానించినట్లే. తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులు ముఖ్యం కాదని చెప్పినట్లేననిఅన్నా రు. రాహుల్ తన ప్రసంగంలో నిరుద్యోగం గురించి కీలక వ్యాఖ్యలు చేశా రు. అన్ని దేశాల్లో ఉన్నట్లుగా అమెరికాలో కూడా నిరుద్యోగ సమస్య ఉందన్నారు. అయితే భారత్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. అయితే మన పొరుగున ఉన్న చైనా, వియత్నాంలలో మాత్రం నిరుద్యోగం లేదన్నారు. ఒకప్పుడు అమెరికాలోనే అన్నీ తయారయ్యేవన్నారు.
తయారీ గురించి ఆలోచించడం మానేయడంవ ల్లనే భారత్, అమెరికా, యూరప్‌లలో తీవ్ర సామాజిక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. కృత్రిమ మేధ(ఏఐ) తో ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఆయన కొట్టిపారేశారు. ఏఐతో పాతవి పోయి కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. అంతిమంగా ఏఐతో మంచే జరుగుతుందన్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ ఓవర్సీ స్ విభాగం చీఫ్ శామ్ పిట్రోడా మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీజేపీ ప్ర చారం చేస్తున్నట్ల్లుగా ‘ పప్పు’ కాదన్నారు. ఆయనకు విజన్ ఉందని, ఏదై నా విషయంపై లోతుగా ఆలోచించే వ్యూహకర్త అని కొనియాడారు.
రాహుల్ గాంధీ విదేశాల్లో ప్రధాని మోదీపైన, బీజేపీపైనా విమర్శలు చేయడం ఇది మొదటి సారి కాదు.గతంలో కూడా ఆయన అమెరికా పర్యటనలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. రాహుల్ గాంధీ విదేశాల్లో మన దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని బీజేపీ మండిపడింది. మోదీని తిట్టడానికే ఆయన విదేశీ పర్యట నకు వెళ్లినట్లుందని విమర్శించింది. ఇప్పుడు మరో మెట్టు పైకెక్కి చైనాతో రాహుల్ ఒప్పందం చేసుకున్నట్లుగా ఉందంటూ దుయ్యబట్టింది. రాహుల్ తాజా వ్యాఖ్యలపై ఇప్పుడు ఎంత దుమారం చెలరేగుతుందో చూడాలి.