calender_icon.png 3 October, 2024 | 9:02 PM

రాహుల్‌ది త్యాగాల కుటుంబం

03-10-2024 02:25:13 AM

కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలి

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ 

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాం తి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. ‘మూసీ సుందరీకరణ డబ్బుతో రాహుల్‌గాంధీ బతుకుతాడా? నీవు మాట్లాడే మాటల్లో ఏమైనా అర్థం ఉందా? రాహుల్‌గాంధీ కుటుంబం గురించి దేశ ప్రజలకు తెలుసు.

దేశాన్ని 50 ఏళ్లకు పైగా ఆ కుటుంబం పాలించింది. మీ కుటుం బ తరహాలో రాహుల్ కుటుంబాన్ని భావించొద్దు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుం బం.. మీది చిల్లర కుటుంబం’ అని జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రూ పుట్టిన ఆనంద్ భవన్‌ను కూడా దేశానికి రాసిచ్చిన విషయం తెలుసుకోవాలన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఔటర్ లోపు హైడ్రా అని చెప్పారని, అయితే కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం అత్యుత్సా హం చూపుతు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సిన్సియర్ ఆఫీసరే కానీ లీడర్ కాదన్నారు. ఆయన చేస్తున్న విమర్శలను పట్టిం చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

దీక్షల పేరుతో తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఉనికి పెంచుకొనే పనిలో ఉందని, కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉండి రైతులకు ఏం చేయలేకపోయిందని విమర్శించారు. రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్లు ఇస్తామని తీర్మానించి, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.18 వేల కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ ఇప్పటివరకు ఇవ్వాల్సిన 22 కోట్లలో ఎన్ని ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు. దీక్షలు చేసిన రైతులను తొక్కించి చంపిన చరిత్ర బీజేపీకి సొంతమన్నారు.

కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలి 

మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అనుచితంగా విమర్శలు చేయడం సరికాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘ప్రభుత్వ కార్యక్రమాల్లో దండలు వేయడం తప్పా.. హరీశ్‌రావు, కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ నేతలు దండలు వేసిన వాళ్లందరని అలానే అనుకుంటారా’ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.