బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ, నవంబర్ 7: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగిన సంవిధాన్ సమ్మేళన్ కార్యక్రమ ంలో రాజ్యాంగం ఖాళీ కాపీలను పంపిణీ చేశారంటూ అధికార బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పు డు వైరల్‌గా మారింది. బుధవారం రాహుల్ నాగ్‌పూర్ పర్యటనలో తన చేతిలో రెడ్ బుక్ పట్టుకుని అర్బన్ నక్సల్స్, అరాచవాదుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఫడ్నవీస్ ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఖాళీ రాజ్యాంగం పుస్తకాలను పంచడం ఏంటని ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.