calender_icon.png 5 December, 2024 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు ఊపిరి పోసిందే రాహుల్

05-11-2024 01:53:52 AM

  1. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు హర్షణీయం
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కులగణన పోరాటా నికి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఉద్యమానికి ఊపిరి పోసిందే రాహుల్‌గాంధీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ తెలంగాణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ కులగణనకు అండగా నిలిచేందుకు రాహుల్‌గాంధీ తెలంగాణకు రావడం చారిత్రాత్మక పరిణామమని పేర్కొన్నారు.

కులగణనకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా హైకోర్టు తీర్పును అనుసరించి డెడికే టెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, జాజుల లింగంగౌడ్, మాదేవీ రాజేం దర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.