calender_icon.png 12 February, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ పర్యటన రద్దు

12-02-2025 01:17:30 AM

* కాంగ్రెస్ నేతల్లో అయోమయం

హైదరాబాద్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఆకస్మికంగా రద్దయింది. పార్లమెంటులో కీలక బిల్లుల చర్చలో రాహుల్ పాల్గొనాల్సి ఉన్నందున ఆయన పర్యటనను రద్దు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు వెల్లడించిన వివరాల ప్రకారం..

తెలంగాణ పర్యటనలో హన్మకొండకు రానున్న రాహుల్ అక్కడ పార్టీ ము ఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కావాల్సి ఉంది. ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు కాజీపేట నుంచి చెన్నైకి రైలులో వెళ్లాల్సి ఉంది. అయితే రాహుల్ పర్యటనకు సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం వరకు అధికారి కంగా ప్రకటించకపోవడంతో కాంగ్రె స్ నేతల్లో అయోమయం నెలకొంది.

మధ్యాహ్నానికే రాహుల్ పర్యటన రద్దయినట్లు పార్టీ ప్రకటించడం  గందరగోళానికి గురి చేసింది. అగ్రనేత తెలంగాణ పర్యటన ఇలా ఖరా రైందో లేదో అలా రద్దు కావడం పార్టీ వర్గాలను విస్మయపరిచింది.