calender_icon.png 3 December, 2024 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు రాష్ట్రానికి రాహుల్‌గాంధీ

04-11-2024 02:37:48 AM

  1. దశాబ్దాల తర్వాత కులగణన
  2. కులగణనతో అన్ని వర్గాలకు మేలు  
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్  

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి):  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్రానికి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నో దశాబ్దాల తర్వాత కులగణన జరుగుతుందని, కులగణనతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

ఇందులో అనేక ప్రశ్నలు పొందుపర్చడం జరుగుతోందని, ఇంకా ఏమైనా అంశాలు తీసుకుంటే సమగ్రంగా, మరింత లోతుగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణన అంశంపై మేధావులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి రాష్ట్రానికి రానుండటంతో ఆదివారం గాందీభవన్ లో పార్టీ నేతలు, ప్రొఫెసర్లతో పీసీసీ చీఫ్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున..  మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బీజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తెలంగాణకు రాహుల్‌గాంధీ వస్తున్నారని తెలిపారు. కులగణన చేసి ఆయా వర్గాలకు జనాభా ప్రకారం సంపదను పంపిణీ చేస్తామని జోడో యాత్ర లో భాగంగా రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఇలాంటి చరిత్రాత్మకమైన అంశానికి అన్ని వర్గాలు సహకరించా లని పిలుపునిచ్చారు. కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఆదర్శంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్,  ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బెల్లయ్య నాయక్, ప్రీతమ్, ఫహీమ్ ఖురేసి, దీపక్‌జాన్, మెట్టు సాయి, కొత్వాల్, మల్‌రెడ్డి రామిరెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, లింగం యాదవ్, ప్రొఫెసర్లు విశ్వేశ్వర్‌రావు, సింహాద్రి, వెంకటనారాయణ, భూక్య, వివిధ సంఘాల ప్రతినిధులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.