calender_icon.png 26 April, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

26-04-2025 10:01:16 AM

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) శనివారం నాడు హైదరాబాద్(Hyderabad)కు రానున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (Hyderabad International Convention Centre)లో రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ సమ్మిట్ కు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం హెచ్‌ఐసీసీ వేదికగా భారత్‌ సమ్మిట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ సర్కార్ భారత్ సమ్మిట్‌-2025 నిర్వహిస్తోంది.

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రారంభ స్వాగత ప్రసంగాలు చేస్తారు.  రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనడాన్ని ధృవీకరించారని టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిని కలవడానికి రాహుల్ గాంధీ ఆకస్మికంగా కాశ్మీర్‌కు వెళ్లిన నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన ప్లీనరీని శనివారం వాయిదా వేశారు. ఆయన లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి శిఖరాగ్ర సమావేశ ప్రారంభ దినోత్సవానికి హాజరు కాలేదు.