న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) మూడో రోజు కొనసాగుతున్నాయి. మేకిన్ ఇండియా(Make in India)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విఫలమయ్యారని కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై ఏటా అవే ఉన్నాయని మండిపడిన రాహుల్ గాంధీ యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించలేకపోయాయని విమర్శించారు. చాలా సంస్థలు భారత్ ఉత్పత్తులు పెంచడానికి ప్రయత్నిస్తుంటే, తయారీ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోగా, ప్రస్తుతం మొత్తం ఉత్పత్తులను చైనాకు అప్పగించారని రాహుల్ విరుచుకుపడ్డారు. దేశంలో సామాజిక అశాంతి పెరిగిందన్నారు. ఉత్పత్తుల పెంపుపై భారత్ దృష్టి సారించాలని, సాఫ్ట్ వేర్ విప్లవం గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని తెలిపారు. మేకిన్ ఇండియా పథకం ఉద్దేశం మంచిదే కానీ, మేకిన్ ఇండియా ద్వారా పెద్దగా ఒరిగిందేమి లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.