calender_icon.png 25 October, 2024 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షేమపణ చెప్పాలి: పాశం భాస్కర్

12-09-2024 03:36:54 PM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ గారి ఆధ్వర్యంలో గురువారం భువనగిరి లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్ సభ్యులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ మాట్లాడుతూ దేశం యొక్క గౌరవాన్ని కాపాడవలసిన లోక్ సభ సభ్యులు రాహుల్ గాంధీ విదేశాలలో అహలదంగా తిరుగుతూ దేశంలో వున్న అత్యున్నత రాజ్యాంగాన్ని, మరియు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల విధానాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు, అదేవిధంగా వాళ్ళ నానమ్మ, నాన్న ప్రధాన మత్రులుగా వుండడానికి కారణమైన రాజ్యాంగాన్ని తప్పు పట్టి మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. జమ్ము కాశ్మీర్ ఎన్నికల వేళ రద్దు చేసిన ఆర్టికల్ 370 మళ్లీ పునరుద్దరిస్తమని మానిఫెస్టోలో పెట్టడం ఎంతవరకు సబబు ప్రజలు గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం , కిసాన్ మోర్చా రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు జనంపల్లీ శ్యామ్ సుందర్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా ,భారతీయ జనతా యువ మోర్చ జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నీలం రమేష్ ,పట్టణ ఉపాధ్యక్షులు రామకృష్ణా రెడ్డి ,యాట వెంకటేష్, ఎదుగని సంతోష్,పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణాచారి,వల్లంశెట్టి  నగేష్ , చిట్టిప్రోలు శ్రీధర్ ,పల్లెపాటి వేణు,యువమోర్చ పట్టణ  అధ్యక్షులు కానుకుంట్ల రమేష్, మహమూద్ ,వాస నర్సింగ్,నామోజు రాజు,ముచ్యలా సాయి,తాడూరి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు