calender_icon.png 28 December, 2024 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు రావాలి!

05-11-2024 01:32:32 AM

  1. మా సమస్యలు వినాలి
  2. ఉద్యోగార్థులు డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయ న అశోక్‌నగర్‌కు రావాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి తమ సమస్యలను వినాలని కోరుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ప్రాంతంలో పర్యటించి ఉద్యోగార్థుల సమస్యలను అప్పట్లో రాహుల్‌గాంధీ అడిగి తెలుసుకున్నారు. పేపర్ లీకేజీ లు, గ్రూప్స్ పరీక్షల రద్దు, వాయిదా, నిర్వహణ, టీజీపీఎస్సీ బోర్డు ప్రక్షాళన తదితర సమస్యలపై అభ్యర్థులకు ఆయన భరోసా ఇచ్చారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల డిమాండ్ల పై మాట్లాడారు. త్వరలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈ నేపథ్యంలో అశోక్‌నగర్‌కు రాహు ల్ వచ్చి తమ సమస్యలు వినాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.