హైదరాబాద్,(విజయక్రాంతి): రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జవాబిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నమని పొన్నం ప్రభాకర్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలానే మీ నేతృత్వంలో మరింత ముందుకెళ్తామన్న మంత్రి పొన్నం లేఖకు రాహుల్ గాంధీ స్పంధించారు. హామీల అమలు దిశగా సాగుతున్న తెలంగాణ రాష్ట్రానికి అభినందనలు తెలిపారు. రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ కార్యక్రమాలను అభినందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రాహుల్ లేఖలో వెల్లడించారు.