26-04-2025 04:39:27 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (Hyderabad International Convention Centre)లో రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. భారత్ సమ్మిట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని, తను నిన్ననే భారత్ సమ్మిట్ లో పాల్గొన్నాల్సి ఉందన్నారు. కాకపోతే కాశ్మీర్ కు వెళ్లడం వల్ల రాలేకపోయా అని, ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని, కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించాను.. మొదలు పెట్టాక వెనకడుగు వేయలేదని రాహుల్ గాంధీ చెప్పారు. పాదయాత్ర మొదలుపెట్టాక చాలా మంది నాతో కలిసి నడవటం మొదలుపెట్టారని, పాదయాత్రలో జనం సమస్యల వినటం నేర్చుకున్నానని, ప్రజల సమస్యలు వినటంలో నాయకులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. కొత్తతరం భాషను రాజకీయ నాయకులు అర్థం చేసుకొవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.