calender_icon.png 29 December, 2024 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ గాంధీ ముఖాముఖి

05-11-2024 05:58:01 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై సమావేశం మంగళవారం జరుగనుంది. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా నిర్వహిస్తున్న కుల గణన సంప్రదింపుల సదస్సుకు హజరయ్యేందుకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొని నాయకులు, సంఘాల ప్రతినిధులు నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఐడియాలజీ సెంటర్ లో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహించారు. రాహుల్ గాంధీతో జరిగిన ముఖాముఖిలో కుల, విద్యార్థి సంఘాలు, మేధావులతో కూడిన 400 మంది పాల్గొన్నారు. కులగణనపై మేధావుల అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్న రాహులు కులగణనపై ద్వారా జరిగే లాభాలను వివరించనున్నారు.