న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ట్రంప్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపిన రాహుల్, భవిష్యత్తు కోసం ప్రజలు మీ విజన్‌పై విశ్వాసం ఉంచారని అన్నారు. కమలాహారిస్ కు సైతం రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సావంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారని, ఉపాధ్యక్షురాలిగా ప్రజలందరినీ ఏకం చేయాలనే సంకల్పంతో పనిచేశారని రాహుల్ కొనియాడారు. జో బైడెన్ పరిపాలనలో ప్రపంచ పాముఖ్యత కలిగిన అంశాల్లో భారత్, అమెరికా సహకారం మైరుగైందని రాహుల్ పేర్కొన్నారు. 2024 అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.